
మెదక్ టౌన్, వెలుగు : సెల్‌ఫోన్ టవర్ల మెటీరియల్దొంగతనం చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మెదక్పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఎస్పీ బాలస్వామి చోరీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మెదక్‌జిల్లా తూప్రాన్ సబ్డివిజన్పరిధిలోని చేగుంట మండలం రామంతాపూర్, రాంపూర్ గ్రామాల్లో ఈనెల 13, 14 తేదీల్లో ఎయిర్టెల్బ్రాడ్బాండ్ మెటీరియల్ చోరీ అయినట్లు కంపెనీ సిబ్బంది చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఎయిర్టెల్కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్న కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లికి చెందిన మాసాని మహేశ్ ఆధ్వర్యంలోనే చోరీలు జరుగుతున్నట్లు గుర్తించారు.
అనంతరం పోలీసులు మహేశ్‌ను విచారించగా తనతో పాటు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరుకు చెందిన కైదాపూర్సంతోశ్ రెడ్డి, కామారెడ్డి పట్టణానికి చెందిన గోవూరి రత్నాకర్‌రెడ్డి, రాఘవపల్లికి చెందిన కర్రోళ్ల రాజాగౌడ్కలిసి చోరీలు చేస్తామని చెప్పాడు. వీటిని అమ్మేందుకు హైదరాబాద్ రిసాలా బజార్‌కు చెందిన అనిల్, ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్, అఫ్రోజ్ పాషా, కామారెడ్డి జిల్లా వికాస్‌నగర్‌కు చెందిన పగిడిపల్లి అశోక్ సాయం చేస్తారన్నాడు.
వీరందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు. ఈ ముఠా దగ్గరి నుంచి ఇన్నోవా, హ్యుందాయ్, బెలెనో కారుతో పాటు మోటారు బైక్, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, చేగుంట ఎస్ఐ హరీశ్ పాల్గొన్నారు.