కరీంనగర్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలం : ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలం : ఎమ్మెల్యే  గంగుల కమలాకర్
  •     మాజీ మంత్రి, ఎమ్మెల్యే  గంగుల కమలాకర్  

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. మంగళవారం 51వ డివిజన్‌‌‌‌లో రూ.15 లక్షలతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ  చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి  చేయాలని  అధికారులకు సూచించారు. 

తెలంగాణ తొలి  సీఎం  కేసీఆర్ ఆధ్వర్యంలో సీఎం అస్యూరెన్స్ నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని, అనంతరం అధికారంలోకి  వచ్చిన కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాజేందర్‌‌‌‌‌‌‌‌ రావు, అశోక్ రావు, లీడర్లు సూర్యశేఖర్, అంజనేయులు, మధుకర్, తదితరులు  పాల్గొన్నారు.