
కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (KDCC)అంటే రైతులకు ఓ నమ్మకమన్నారు మంత్రి గంగుల కమలాకర్. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు పాడి పరిశ్రమ రంగానికి చేయూతనివ్వాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వందేళ్ల ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న గంగుల ..నాబార్డు ద్వారా గొర్రెలు, మేకల పెంపకానికి, పంట మార్పిడికి, యువతకు ఆర్థిక చేయూత అందించాలన్నారు. సహకార బ్యాంక్ లు చిన్న పరిశ్రమలకు చేయూత అందించాలన్నారు. KDCCబ్యాంకుకు ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుందన్నారు.
మరోవైపు.. రాజకీయం కోసం వచ్చే వారు సహకార సంఘాల్లోకి రావద్దన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ . కమిట్ మెంట్ ఉన్నవారే సహకార సంఘాల్లోకి రావాలన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో ఎలాంటి కరువు లేదన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడి ఎక్కువ ఉందని..దాన్నికేంద్రం రాజకీయానికి వాడుకోవడం దురదృష్టకరమని తెలిపారు. పంట మార్పిడి అవసరం అని చెప్పిన కేంద్ర పార్టీ నేతలే ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. వరంగల్, నిజామాబాద్ సహకార బ్యాంక్ లు నష్టాల్లో ఉంటే కరీంనగర్ సహకార బ్యాంక్ అభివృద్ధిలో ఉందిని.. దీనికి ఆయా పాలక వర్గాల పనితీరే కారణమన్నారు వినోద్ కుమార్.
మరిన్ని వార్తల కోసం..