మంచిర్యాల, వెలుగు: టీన్జీవోస్ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం కొసాగుతోంది. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ ఆఫీసులో ఉద్యోగులకు టీన్జీవోస్ యూనియన్లో సభ్యత్వం కల్పించారు. ఈ సందర్భంగా యూనియన్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు నాగుల గోపాల్ మాట్లాడుతూ.. టీన్జీవోస్ యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్, జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో 100 శాతం సభ్యత్వం నమోదు చేయడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు టీన్జీవోస్ యూనియన్లో సభ్యత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో టీన్జీవోస్ యూనియన్ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి అజయ్ ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు రామ్ కుమార్, తిరుపతి, ఆరోగ్య శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ విశ్వేశ్వర్ రెడ్డి, వెటర్నరీ శాఖ సూపరింటెండెంట్ గంగారాం, యూనియన్ సభ్యులు సంజిత్ రావు, స్వరూప, ఎస్తేర్ రాణి, శాంతి, హారిక, సంపత్, రాజమణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
