హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర మంత్రిగా ప్రశ్నించాలని కేటీఆర్అంటే.. అంత ఉలుకెందుకన్నారు. బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి, డంప్ యార్డ్ అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై ఫోకస్చేయ్యాలని డిమాండ్‌చేశారు. రెండున్నరేండ్లుగా కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదన్నారు. రేవంత్, సంజయ్ ఇద్దరూ తోడు దొంగలని ఆరోపించారు. కేటీఆర్రైతు సభ సక్సెస్‌కావడంతో ప్రభుత్వంలో వణుకు మొదలైందని కేపీ వివేకానంద్అన్నారు. కేటీఆర్స్పీచ్అవ్వగానే ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ తో ఇక్కడ ఆయన అనుచరులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రైతులకు ఏం చేశారో చెప్పలేక.. మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు.
