ఐదు గంటలు భేటీ.. మరో సంచలనానికి తెర లేపుతున్నారా?

ఐదు గంటలు భేటీ.. మరో సంచలనానికి తెర లేపుతున్నారా?

దాదాతో ద్రవిడ్‌ మీటిం గ్‌ ముం బై: నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్ సీఏ)కి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీతో గురువారం సమావేశమయ్యారు. వెన్నునొప్పి నుంచి కోలుకున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా ఫిట్ స్‌ను అంచనా వేయడానికి ద్రవిడ్‌ నిరాకరించిన నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. సాధారణ సమావేశమే అని బయటకు చెబుతున్నా.. మొత్తం వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అలాగే ఎన్ సీఏను మరింత మెరుగుపర్చే ప్రణాళికలను కూడా ద్రవిడ్‌.. దాదా ముందు ఉంచినట్లుతెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు బీసీసీఐ హెడ్‌ క్వార్టర్ స్‌ లోపలికి వెళ్లిన ద్రవిడ్‌..సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చాడు.మీడియాతో మాట్లాడకుండానే ఈ మాజీ  కెప్టెన్‌ వెళ్లిపోయాడు. అయితే ఇది సాధారణ మీటింగేనని చెప్పిన దాదా క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)పై పెద్దగా స్పందించలేదు. సీఏసీని ఏర్పాటు చేసేందుకు సీనియర్‌ క్రికెటర్లతో చర్చించాలని బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ గంగూలీకి సూచించినట్లు సమాచారం. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్న దాదా క్రికెట్లో  మరేమైనా సంచలనాలకు తెరలేపుతున్నారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.