రూ.2 వేలకు కిలో గంజాయి కొని... రూ. 20 వేలకు అమ్మకం

రూ.2 వేలకు కిలో గంజాయి కొని... రూ. 20 వేలకు అమ్మకం

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. విశాఖపట్నం వైపు నుండి హైదరాబాద్ ద్వారా కర్ణాటక, మహారాష్ట్రలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్నా సీపీ... చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మూడు కార్లలో తరలిస్తున్న రూ.1.2కోట్ల విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏపీతో పాటు కర్ణాటక , మహారాష్ట్రకు చెందిన ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్ లను అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. నిందితుల్లో కొందరు గతంలోనూ గంజాయి కేసులో అరెస్టయ్యారన్న  సీపీ మహేష్ భగవత్.... 2, 3 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి...20 వేలకు కిలో అమ్ముతున్నారన్నారు. తాము స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి 2 లక్షల విలువ వుంటుందని చెప్పారు.

ఎన్డీపీఎస్ చట్టం 31(A) చాలా బలమైనదన్న  సీపీ మహేష్ భగవత్... ఈ కేసులో ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు వున్నాయన్నారు. గంజాయి వాడుతున్న వారి కేసులో కొన్ని సార్లు కౌన్సిలింగ్ లు కూడా మాకు ఇబ్బందిగా మారాయని చెప్పారు. అందుకే గోప్యంగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలంటే తెలియని వాళ్ళు సైతం విపరీతంగా జరుగుతున్న ప్రచారం వల్ల వాటికి ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు.