Sankranti 2026: సంక్రాంతి పుణ్యకాలం.. .మీ రాశి ప్రకారం దానం చేయాల్సిన వస్తువులు ఇవే..!

Sankranti 2026:  సంక్రాంతి  పుణ్యకాలం..   .మీ రాశి ప్రకారం దానం చేయాల్సిన వస్తువులు ఇవే..!

పండుగలు వచ్చినా.. పబ్బం వచ్చినా హిదువులు దేవాలయాలను సందర్శిస్తారు. హిందువులకు సంక్రాంతి పండుగ అత్యంత ముఖ్యమైన పండుగ.  ప్రతి ఏడాది  ఈ పండుగ జనవరి నెలలో వస్తుంది.  ఈ ఏడాది జనవరి 14,15,16 తేదీల్లో వరుసగా భోగి.. మకరసంక్రాంతి.. కనుమ పండుగలు జరుపుకోనున్నారు.  పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగరోజు ప్రతి ఒక్కరు జన్మరాశిని బట్టి కొన్ని వస్తువులను దానం చేస్తే జాతక రీత్యా దోషాలు తొలగిపోతాయని  పండితులు చెబుతున్నారు.  ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

 జ్యోతిష్యం ప్రకారం ఈ పెద్ద పండుగ సూర్యగమనంతో ముడిపడి ఉంది.   సూర్యుడు  మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు.  మకర సంక్రాంతినాడు ప్రజలు గంగా నది, ఇతర పవిత్ర నదులలో స్నానం ఆచరిస్తారు. ఈ రోజున ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తింటారు. పతంగులను ఎగురవేస్తారు. ఈరోజు దానధర్మాలు కూడా చేస్తారు. ఈరోజున దానం చేయడమనేది పురాతన కాలం నుంచి వస్తోంది. ఈ రోజు ఆయా రాశులవారు తమకు సంబంధించిన దానాలు చేసి సూర్యుడి అనుగ్రహం పొందుతారు. దీంతో వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 

సంక్రాంతి నాడు ఏ రాశివారు ఏం దానం చేయాలంటే?

  • మేష రాశి  : బెల్లం 
  • వృషభ రాశి :  బియ్యం 
  • మిథున రాశి : పెసర పప్పుతో తయారు చేసిన  కిచిడి
  • కర్కాటక రాశి :  బియ్యం, చక్కెర మిఠాయి, నువ్వులు 
  • సింహ రాశి: నల్ల నువ్వులు, బెల్లం, గోధుమలు, బంగారం  ( బంగారానికి ప్రత్యమ్నాయంగా ధనం) 
  • కన్యా రాశి:  పెసర పప్పు కిచిడి 
  • తుల రాశి : తెల్లని బట్టలు, చక్కెర, దుప్పట్లు 
  • వృశ్చిక రాశి : నల్ల  నువ్వులు, బెల్లం 
  • ధనుస్సు రాశి : కుంకుమపువ్వు 
  • మకర రాశి :  నూనె మరియు నువ్వులు
  • కుంభ రాశి: పేదలకు ఆహారం 
  • మీన రాశి  :   పట్టు వస్త్రం, నువ్వులు, పప్పులు, బియ్యం 

 ఇలా ఆ రాశివారు ఆయా దానాలు చేయడం ద్వారా సూర్యుడి అనుగ్రహంతో అదృష్టాన్ని పొందుతారు. వారి జీవితాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఇవన్నీ కూడా  తెలిపిన వస్తువులు కేజీం పావు చోప్పున దానం చేయాలి. వారికున్న ప్రతికూలతలు తగ్గిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.