గంజాయి విక్రయిస్తున్న దంపతులు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న దంపతులు అరెస్ట్

 
బషీర్​బాగ్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్​చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధి ఆదర్శ్ నగర్ హిల్ ఫోర్ట్ ఈఎస్ఐసీ కార్యాలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్​పోలీసులకు మంగళవారం సమాచారం వచ్చింది. ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజి రెడ్డి ఆధ్వర్యంలో వారు రైడ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న మంజుల–ముకేశ్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. 

వారి వద్ద నుంచి 2.1 కేజీల గంజాయి , ఒక టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా వైజాగ్, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొస్తూ నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరికి సహకరిస్తున్న దేవరాజ్, దేవా, షేక్ ఖాలీద్, అమన్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

గంజాయి చాక్లెట్లు పట్టివేత

పద్మారావునగర్: సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్ టీఎఫ్‌‌‌‌సీఐ నాగరాజు మంగళవారం తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. 

ప్లాట్‌‌ఫాం నంబర్​10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని గుర్తించి, ఓపెన్​చేయగా.. 1.600 కేజీల గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. వాటిని తీసుకొచ్చిన వ్యక్తి పోలీసులను చూసి పరారయ్యాడు. చాక్లెట్లను సికింద్రాబాద్‌‌ ఎక్సైజ్‌‌ స్టేషన్‌‌లో అప్పగించామని, చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్టీఎఫ్​పోలీసులు పేర్కొన్నారు.