
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌కు చెందిన యువ టెన్నిస్ ఆటగాడు గంటా సాయి కార్తీక్ రెడ్డి కజకిస్తాన్‌లోని షింకెంట్‌లో జరిగిన వరల్డ్ టూర్ టెన్నిస్ 15కె ఐటీఎఫ్ ఫ్యూచర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు.
మెన్స్ డబుల్స్‌లో ప్రజ్వల్ దేవ్‌తో కలిసి బరిలోకి దిగిన కార్తీక్ శనివారం జరిగిన ఫైనల్లో 6–7 (9/11), 3–6తో లోమకిన్ గ్రిగోరి (కజకిస్తాన్)–వెర్బిన్ పావెల్ (రష్యా) చేతిలో పోరాడి ఓడిపోయారు.