
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం (నార్త్) ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే రాజీనామా చేస్తున్నట్లు గంటా ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేశారు . స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటికరిస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే తన రాజీనామా ఆమోదించాలని కోరారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ పంపారు. స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు గంటా. తాను మాటల మనిషనని కాదని చేతల మనిషినని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.