
హైదరాబాద్, వెలుగు: ఎస్‌జీఎఫ్ తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో గారపాటి సృజని మూడు మెడల్స్‌తో మెరిసింది. బాచుపల్లిలోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో శనివారం జరిగిన ఈ టోర్నీలో అండర్17 గర్ల్స్ కేటగిరీలో పోటీ పడ్డ సృజని (రంగారెడ్డి) 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్, 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గింది. 50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో సిల్వర్ సాధించింది. అండర్14 కేటగిరీ 200 మీ. ఫ్రీస్టయిల్‌లో హైదరాబాదీ శివాని గోల్డ్ గెలిచింది.