క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది

క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది

నిన్న మొన్నటి వరకు టమాటా, ఉల్లిపాయల ధరలు పెరిగాయి.  . ఇక ఇప్పుడు.. వెల్లుల్లి వంతు వచ్చింది.  దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన కొన్ని వారాల్లోనే ఈ ధరలు రెండింతలు పెరగడగం గమనార్హంనిత్యావసర సరకుల నిమిత్తం దుకాణానికి వెళ్లిన సామాన్యులు ఆకాశాన్నంటిన వెల్లుల్లిని చూసి కొనేందుకు జంకుతున్నారు. ఇది వరకు కిలో చొప్పున కొనుగోలు చేసిన గృహిణులు ఇప్పుడు విడిగా రూ.20 లేదా రూ.30 కి తెచ్చుకుని వాడుకుంటున్నారు. ప్రస్తుతం హోల్​ సేల్​ మార్కెట్లలో క్వింటా వెల్లుల్లి రూ 20 వేల వరకు ధర పలుకుతోంది.  దీంతో వెల్లుల్లి సాగు చేసిన రైతుల పంట పండింది.  

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు..

నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కి ఉల్లి, టమాటా ధరలు దిగి వచ్చాయి. అయితే, ప్రస్తుతం వెల్లుల్లి మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తోంది. నిత్యం వంటల్లో  వెల్లుల్లి తప్పనిసరి.... లేదంటే ఆ కూర రుచిగా ఉండదు. కానీ, ప్రస్తుతం రిటైల్​ మార్కెట్లో  వెల్లుల్లి కిలో రూ. 500పై మాటే పలుకుతోంది. దీంతో వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకుంది... 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర.. రెండు వారాల్లోనే డబుల్‌ అయ్యే పరిస్థితి చేరింది.

వాస్తవానికి.. గతేడాది నవంబరు నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరులో రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లి కిలో 350 నుంచి 400 ఉండగా.. హోల్ సేల్ మార్కెట్‌లో  వెల్లుల్లి 250 పలికింది. కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి.. ఏకంగా కిలో 500కి ఎగబాకింది.  వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్లలోకి సరఫరా అంతంతమాత్రంగా ఉంది. డిమాండ్‌కు తగిన సప్లై లేకపోవడంతో వెల్లుల్లి ధర పెరుగుతోంది. వెల్లుల్లి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది మంచి ఆదాయం వచ్చింది. ఇప్పుడు కూడా చాలా మండీల్లో టోకుగా రైతులకు క్వింటాల్‌కు రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. . గతేడాది రైతులు కిలో వెల్లుల్లిని రూ.10 నుంచి 20 వరకు మాత్రమే విక్రయించారు.

వెల్లుల్లి సాగు ఖరీఫ్, రబీ సీజన్లలో జరుగుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన పంట దెబ్బతిందని వ్యాపారులు తెలిపారు. భారత్‌లోని మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 40% వాటా మహారాష్ట్ర  రైతులు  సాగు చేశారు. వంటల్లో వెల్లుల్లి కలిపి వాడటం తప్పనిసరి. పెరిగిన ధరలతో వంటల్లో వెల్లుల్లి వాడటం లేదని  గృహిణులు చెబుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వీధుల్లో తిరిగే వ్యాపారులు ప్రస్తుతం ధరల పెరుగుదల కారణంగా పత్తా లేకుండా పోయారు. కృత్రిమ కొరత సృష్టించే పెద్ద వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమంటున్నారు కొందరు.  ఇక.. అల్లం, వెల్లుల్లితోపాటు.. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి