గచ్చిబౌలిలో ఉత్సాహంగా రెసోఫెస్ట్.. రెండు రోజుల పాటు ఉత్సవాలు

గచ్చిబౌలిలో ఉత్సాహంగా రెసోఫెస్ట్.. రెండు రోజుల పాటు ఉత్సవాలు

రెసోనెన్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం గచ్చిబౌలి స్టేడియంలో ‘రెసోఫెస్ట్ 2025’ పేరిట వార్షిక సాంస్కృతిక, విద్యా మహోత్సవాలను నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ‌‌‌‌‌‌‌‌ వేడుకల్లో మొదటి రోజు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, తెలంగాణలోని 35 క్యాంపస్​లకు చెందిన ఏడు వేల మందికి పైగా ఇంటర్, స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఈ వేడుకకు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఆదిత్య, జాగిల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాజ్ పీ నారాయణ, బ్రహ్మోస్ ఎయిరో స్పేస్‌‌‌‌‌‌‌‌ సీఈఓ ఎండీ డాక్టర్ జయతీర్థ్ ఆర్‌‌‌‌‌‌‌‌ జోషి, సినీ ‌‌‌‌‌‌‌‌దర్శకుడు నాగ్ అశ్విన్, నటులు శర్వానంద్‌‌‌‌‌‌‌‌, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, యాంకర్ సుమ కనకాల, సినీ నటి ఆనంది పాల్గొన్నారు.