కరోనా రిలీఫ్ ఫండ్ కు బిల్ గేట్స్ భారీ విరాళం

కరోనా రిలీఫ్ ఫండ్ కు బిల్ గేట్స్ భారీ విరాళం

కరోనా వైరస్ ను అరికట్టేందుకు చాలా ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారీ విరాళాన్ని ప్రకటించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)కు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున  150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఆయన అందించారు.

కొద్ది రోజుల క్రితమే బిల్ గేట్స్ కరోనాను కట్టడి చేసేందుకు విరాళం ఇచ్చారు. లేటెస్టుగా  గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళంతో 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

కరోనా మహమ్మారి మానవ మనుగడకు పెను ముప్పుగా మారిందన్నారు బిల్ గేట్స్. ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రపంచ ఆరోగ్య సంస్థ సేవలు ఎంతో  అవసరమన్నారు.