
గ్వాంగ్జ్ (సౌత్ కొరియా): పతకం ఆశలతో బరిలోకి దిగిన ఇండియా యంగ్ ఆర్చర్ గాథా ఖడకే.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిరాశపర్చింది. శుక్రవారం జరిగిన విమెన్స్ రికర్వ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాథా 0–6తో వరల్డ్ నంబర్‌వన్ లిమ్ సి హ్యోన్ చేతిలో ఓడింది. దాంతో ఈ విభాగంలో పతకం కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గాథా కుదురుకోకముందే లిమ్ గురి తప్పకుండా బాణాలు సంధించింది. దాంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.
అరంగేట్రం చేసిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గాథా ప్రిక్వార్టర్స్‌కు చేరడంతో భవిష్యత్‌పై మరిన్ని ఆశలు పెరిగాయి. అటాన్ దాసు, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌తో కూడిన ఇండియా బృందం 2019లో చివరిసారి రికర్వ్‌లో మెడల్ గెలిచింది. లిమ్ మూడు పర్ఫెక్ట్ టెన్స్ సాధించగా, గాథా 9, 8, 9 పాయింట్లతోనే సరిపెట్టుకుంది. రెండో సెట్‌లోనూ లిమ్ జోరు కొనసాగగా, గాథా 8, 9 పాయింట్లతో వెనకబడింది.