చండీగఢ్: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్టు బ్రేక్ చేసింది. శనివారం జరగాల్సిన ఎలక్షన్స్‌పై స్టే విధించింది. హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ (హెచ్‌డబ్ల్యూఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ స్టే కొనసాగుతుందని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
తమకు కాకుండా హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ కు డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించడాన్ని సవాలు చేస్తూ హెచ్‌డబ్ల్యూఏ కోర్టును ఆశ్రయించింది. హెచ్‌డబ్ల్యూఏ రాష్ట్రంలో రిజిస్టర్డ్ సొసైటీగా, డబ్ల్యూఎఫ్‌ఐకి అనుబంధంగా ఉందని దాని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ గుర్తింపు లేదన్నారు. దాంతో డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలపై హైకోర్టు న్యాయమూర్తి స్టే విధించారు.
