
బుధవారం (ఫిబ్రవరి1) జరిగిన అదానీ గ్రూప్ డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ లో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఎఫ్ పీఓ (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్) డబ్బు వెనక్కి ఇచ్చేస్తునన్నట్లు గౌతమ్ అదానీ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఉదయం తన నిర్ణయాన్ని ప్రకటించారు. అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ షేరు ధర దారుణంగా పడిపోతుండమే ఈ నిర్ణయానికి కారణమని అదానీ వెల్లడించారు.
‘వ్యాపారవేత్తగా 4 దశాబ్దాలకుపైగా సాగుతున్న ప్రయాణంలో వాటాదారులంతా నాతో ఉన్నారు. ఇంతకాలం పెట్టుబడిదారుల సంఘం నుండి మద్దతు లభించింది. ఇకపై కూడా వారి మద్దతు అవసరం. నా విజయాలన్నింటికీ వారికి రుణపడి ఉంటా. నాకు, నా పెట్టుబడిదారుల ప్రయోజనాలే ప్రధానం. అందుకే పెట్టుబడిదారులను నష్టాల నుండి రక్షించడానికి నేను FPOని ఉపసంహరించుకున్నా’ అంటూ అదానీ వీడియో రిలీజ్ చేశారు.