Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు

Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఒక అంచనాకు రావడం కష్టం. అతని ఉద్దేశ్యం ఏదైనా చేసే కామెంట్స్ మాత్రం బోల్డ్ గా ఉంటాయి. ఈ కారణంగానే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ధైర్యంగా చెప్పగలడు అని పేరున్నా అతను చేసే కామెంట్స్ కి విమర్శలు తప్పవు. ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా ముక్కు సూటిగా మాట్లాడం ఇతని ప్రత్యేకత. తాజాగా మరోసారి తన వింత సమాధానంతో అందరికీ షాక్ ఇచ్చాడు.

ఫుట్ ఆటగాళ్లలో క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్ధరిలో ఎవరు ఫేవరేట్ అని తేల్చుకోవడం కష్టం. అయితే గంభీర్ మాత్రం తనకు ఇద్దరి ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. మీకిష్టమైన ఫుట్ బాల్ ప్లేయర్ ఎవరని అడిగితే మెస్సీ, రోనాల్డో కాకుండా మార్కస్ రష్ ఫోర్డ్ ను తన ఫేవరేట్ ప్లేయర్ గా ఎంచుకున్నాడు.  రష్ ఫోర్డ్ ఇంగ్లీష్ ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు. ఇద్దరిలో ఎవరు బెటర్ ప్లేయర్ అని అడిగితే రొనాల్డోకే ఓటేశాడు. దీంతో గంభీర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. గంభీర్ సమాధానాలు ఊహకు అందవు అని ట్రోల్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతం గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతని సారధ్యంలో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సునీల్ నరైన్ ను ఓపెనింగ్ కు పంపడం, రఘువంశీ లాంటి యువ ఆటగాళ్ల ప్రతిభ గుర్తించడం లాంటి విషయాలు గంభీర్ పై ప్రశంసల వర్షం కురిసేలా చేస్తున్నాయి.