పాక్, భారత్ మ్యాచులపై రెండు దేశాల బోర్డులు నిర్ణయం తీసుకోవాలి:గంభీర్

పాక్, భారత్  మ్యాచులపై రెండు దేశాల బోర్డులు నిర్ణయం తీసుకోవాలి:గంభీర్

పాక్లో జరిగే ఆసియాకప్ 2023లో భారత్ పాల్గొనకపోతే..2023 వరల్డ్ కప్ ఆడేందుకు పాక్ భారత్ రాదంటూ పీసీబీ చీఫ్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలకు టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ కౌంటరిచ్చాడు. భారత్ పాక్ మ్యాచులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా..ఇరు దేశాల బోర్డులు తీసుకోవాలన్నాడు. సమిష్టిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. పాక్ బోర్డు అంటే రమీజ్ రాజా ఒక్కరు మాత్రమే కాదన్నాడు. ఆ దేశ బోర్డులోని సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. 

జై షా మాటకు రమీజ్ కౌంటర్..

2023లో పాక్లో ఆసియాకప్ జరగనుంది. అదే ఏడాది భారత్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అయితే ఆసియాకప్ 2023 టోర్నీ కోసం భారత్ పాక్ వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి అన్నాడు. పాక్తో ఇతర దేశాల్లో మ్యాచుల్లో పాల్గొంటామని..కానీ ఆ దేశంలో మాత్రం పర్యటించబోమన్నాడు. దీనిపై స్పందించిన రమీజ్ రాజా..ఒక వేళ ఆసియాకప్ కోసం భారత జట్టు పాక్  రాకుంటే..వరల్డ్ కప్లో ఆడేందుకు భారత్కు పాక్ రాదని రమీజ్ రాజా స్పష్టం చేశాడు. 

రమీజ్ హెచ్చరికపై అనురాగ్ ఠాకూర్ స్పందన..

పాకిస్తాన్ బెదిరింపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ అన్నాడు. వరల్డ్ కప్లో ఆడేందుకు పాకిస్తానే..భారత్కు వస్తుందన్నాడు.  ప్రపంచ క్రికెట్లో భారత్ బలమైన శక్తి అని  చెప్పాడు. ఏ కంట్రీ కూడా భారత్ను డామినేట్ చేయలేదని చెప్పారు. ఏది ఏమైనా పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశాడు. కానీ వరల్డ్ కప్ ఆడేందుకు పాక్ భారత్కు రావాల్సిందేనన్నాడు.