V6 News

‘గాయపడ్డ సింహం’ మెమొరబుల్ హిట్ అవ్వాలి: నారా రోహిత్

‘గాయపడ్డ సింహం’ మెమొరబుల్ హిట్ అవ్వాలి: నారా రోహిత్

తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’.  హీరో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్ర పోషించాడు. పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. మే1న సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

అతిథిగా హాజరైన  హీరో నారా రోహిత్ మాట్లాడుతూ ‘నిర్మాతలు విజయ్, పవన్‌‌‌‌‌‌‌‌ కోసం వచ్చాను. అలాగే పవన్‌‌‌‌‌‌‌‌తో ఇదే బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నా నెక్స్ట్ సినిమా చేస్తున్నా. నిర్మాతలందరికీ ఈ సినిమా మెమొరబుల్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని విష్ చేశాడు.  శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘పవన్ సాదినేని డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫస్ట్ సినిమాలో నేను హీరోగా నటించా.

ఇప్పుడు తను నిర్మిస్తున్న చిత్రంలోనూ నటించడం హ్యాపీ.  నిర్మాతలంతా నా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌. నా వంతు కంట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌గా ఇందులో నటించా’ అని చెప్పాడు. అందరూ హాయిగా నవ్వుకోవాలంటే ఈ సినిమా చూడాలని కీలకపాత్ర పోషించిన జేడీ చక్రవర్తి చెప్పారు. ఈ సినిమా తనకు మంచి ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చిందని దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌ ఫరియా అబ్దుల్లా,  మానస చౌదరి నిర్మాతలు పవన్ సాదినేని, సందీప్, భాను కిరణ్, కో-ప్రొడ్యూసర్ దివ్య, మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి, ఎడిటర్ విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.