బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకులు ఖమ్మం , వెలుగు : ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మహా కూటమి నుంచి బీసీ నాయకుడు గాయత్రి రవికే టికెట్ కేటాయిం చాలని బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ యువకులు డిమాండ్ చేశారు. బీసీకి కాదని మరో సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే తమ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుం దని వారు హెచ్చరించారు. ఆదివారం స్థానిక బుర్హాన్
పురంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన గాయత్రి రవి అభిమానులు, బీసీ, ఇతర కులాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బీసీల్లో బలమైన నాయకుడిగా ఉన్నగాయత్రి రవిని ఖమ్మం ప్రజలు కోరుకుంటున్ నా రని అన్నారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్
గా గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో వివిధ సంఘాల ముఖ్య నాయకులు రాపర్తి రాజా, జక్కుల రాజేశ్, గోలెపు గణేశ్, మహ్మద్ ఇంతియాజ్ పాల్గొన్ నారు.
