
–సింగపూర్ : ఇండియా డబుల్స్ యంగ్ షటర్లు పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ సింగపూర్ ఓపెన్‌లో మరో సెన్సేషనల్ పెర్ఫామెన్స్ చేస్తూ సెమీఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన విమెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ గాయత్రి–ట్రీసా 18–21, 21–19, 24–22తో ఆరో సీడ్ సౌత్ కొరియా జంట కిమ్ సో యెంగ్–కాంగ్ హీ యంగ్‌పై మూడు గేమ్స్ పాటు అద్భుతంగా పోరాడి గెలిచారు.
గంటా 19 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయినా రెండో గేమ్ గెలిచిన ఇండియా జోడీ మ్యాచ్‌లో నిలిచింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఆఖరి గేమ్‌లో చివర్లో గొప్పగా ఆడి సెమీస్ చేరింది. 30వ ర్యాంకర్స్ గాయత్రి–ట్రీసా శనివారం జరిగే సెమీస్‌లో నాలుగో సీడ్ జపాన్ షట్లర్లు నమి మత్సుయమ–చిహరు షిడాతో పోటీ పడతారు.