ఫుడ్​ కోసం వచ్చినోళ్లపై ఇజ్రాయెల్ కాల్పులు..గాజాలో 31 మంది మృతి

ఫుడ్​ కోసం వచ్చినోళ్లపై ఇజ్రాయెల్ కాల్పులు..గాజాలో  31 మంది మృతి

రఫా: గాజాలో హ్యుమానిటేరియన్ ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడులకు పాల్పడిందని హమాస్ ఆరోపించింది. ఈ దాడుల్లో 31 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 170 మంది గాయపడ్డారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఆకలితో అలమటిస్తున్న వారికి సాయం చేస్తున్నామని చెబుతూ.. ఆహారం కోసం వచ్చిన అమాయక పౌరులపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపించిందని హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ మానవతాసాయం అందించే సెంటర్లు కావు, సామూహిక హత్యలకు ఉచ్చులు అని పేర్కొంది. అయితే ఎయిడ్ సెంటర్ వద్ద జరిగిన కాల్పుల్లో గాయపడినోళ్ల గురించి ప్రస్తుతానికి తెలియదని, దీనిపై సమీక్షిస్తున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్​ వైమానిక దాడులు కూడా జరిపినట్లు సమాచారం. నివాస సముదాయాలపై బాంబు దాడులతో చుట్టుపక్కల జనం పరుగులు తీశారు. కాగా, తమ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద కాల్పులు జరగలేదని, బాధితులకు ఫుడ్ పంపిణీ చేశామని గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ పేర్కొంది.

అసలేం జరిగింది? 

రఫాలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఫుడ్ పంపిణీ చేశారు. అక్కడికి వేలాది మంది బాధితులు తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగిందని, ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పుల్లో కొంతమంది మరణించారని మీడియా పేర్కొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు బాధితులు వేలాదిగా తరలిరావడంతో, అందరూ తిరిగి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది. అయితే బాధితులు అలాగే ముందుకు వెళ్లడంతో దాదాపు కిలోమీటర్ దూరం నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ‘మాపై నలుదిక్కుల నుంచి కాల్పులు జరిపారు. నా కళ్ల ముందే 10 మంది కుప్పకూలిపోయారు. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది’ అని ప్రత్యక్ష సాక్షి అమర్ అబూ తెలిపాడు.