అంచనాలను మించిన జీడీపీ వృద్ధి రేటు.. క్యూ4లో 7.4 శాతం పెరుగుదల

అంచనాలను మించిన జీడీపీ వృద్ధి రేటు.. క్యూ4లో 7.4 శాతం పెరుగుదల
  • 2024–25 మొత్తానికి గాను 6.5 శాతం వృద్ధి రేటు.. నాలుగేళ్ల కనిష్టం
  • కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, వ్యవసాయ సెక్టార్లలో పెరిగిన ప్రొడక్షన్‌

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2024–-25 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో (క్యూ4) అంచనాలను మించి 7.4 శాతం వృద్ధి చెందింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 6.4 శాతం గ్రోత్ రేటు నమోదు కాగా, ఈసారి క్యూ4లో 6.7 శాతం వృద్ధి చెందుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు.  మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు   6.5 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం   అంచనా వేసింది. క్వార్టర్‌‌‌‌‌‌‌‌  నుంచి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ప్రకారం,   జీడీపీ వృద్ధి రేటు పెరిగినప్పటికీ,  పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్టానికి తగ్గింది. 2021–-22లో జీడీపీ వృద్ధి 9.7 శాతం పెరగగా, 2022–-23లో 7.6 శాతం, 2023–24లో 9.2 శాతం వృద్ధి చెందింది. చైనా ఎకానమీ ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 5.4 శాతం పెరిగింది.

క్యూ4లో జీడీపీ నెంబర్లు ఇలా..
* క్వార్టర్లీ‌‌‌‌ రియల్ జీడీపీ (బేస్‌‌‌‌ ఇయర్ ధరల ఆధారంగా) క్యూ4లో రూ.51.35 లక్షల కోట్లకు చేరింది.  గత ఏడాది క్యూ4లో రూ.47.82 లక్షల కోట్లుగా ఉంది. ఇది  7.4 శాతం గ్రోత్‌‌‌‌కు సమానం. 
* నామినల్ జీడీపీ (ప్రస్తుత ధరల దగ్గర) క్యూ4లో రూ. 88.18 లక్షల కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోని రూ. 79.61 లక్షల కోట్ల నుంచి 10.8 శాతం  వృద్ధి చెందింది.

పూర్తి  2024-25 ఆర్థిక సంవత్సరం:
* రియల్ జీడీపీ రూ. 187.97 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.  2023–-24 చివరి నాటికి ఉన్న  రూ.176.51 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.5 శాతం ఎక్కువ. 
* నామినల్ జీడీపీ రూ.301.23 లక్షల కోట్ల నుంచి 9.8 శాతం  వృద్ధి చెంది రూ330.68 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.
గ్రాస్‌‌‌‌ వాల్యూ యాడెడ్ నెంబర్లు..
* రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌‌‌ (జీవీఏ) (క్యూ4లో) రూ.45.76 లక్షల కోట్లుగా ఉంది.  గత ఏడాది క్యూ4లో ఇది రూ.42.86 లక్షల కోట్లు.   రియల్ జీవీఏ 6.8 శాతం వృద్ధి చెందింది. జీవీఏ అంటే  సర్వీస్‌‌‌‌ లేదా  మాన్యుఫాక్చరింగ్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌ జోడించే ఉత్పాదకత. జీడీపీ నుంచి ప్రభుత్వ ట్యాక్స్‌‌‌‌లను తీసేసి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలను యాడ్ చేస్తే జీవీఏ వస్తుంది. 
* నామినల్ జీవీఏ  గత ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోని రూ. 72.51 లక్షల కోట్ల నుంచి  9.6 శాతం పెరిగి రూ.79.46 లక్షల కోట్లకు చేరుకుంది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను..
* 2024–-25కి రియల్ జీవీఏ రూ.171.87 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2023–24లో ఇది రూ.161.51 లక్షల కోట్లుగా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌‌‌‌‌ 6.4 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా.
* నామినల్ జీవీఏ 9.5 శాతం పెరిగి రూ. 274.13 లక్షల కోట్ల నుంచి రూ. 300.22 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.

సెక్టార్ల వారీగా జీవీఏ వృద్ధి..
* మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉత్పాదకత వృద్ధి రేటు  గత ఏడాది క్యూ4లో 11.3 శాతం పెరగగా, ఈ ఏడాది క్యూ4లో 4.8 శాతమే పెరిగింది. 
* కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌‌‌‌లో గ్రోత్‌‌‌‌ రేటు 10.8 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం క్యూ4లో  8.7 శాతం గ్రోత్ రేటు నమోదైంది.
* వ్యవసాయ సెక్టార్ వృద్ధి రేటు గత ఏడాది క్యూ4లో 0.9 శాతం ఉంటే, ఈ ఏడాది క్యూ4 లో 5.4 శాతానికి పెరిగింది. 
* ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, ఇతర యుటిలిటీ సర్వీసెస్ సెగ్మెంట్ క్యూ4లో 5.4 శాతం వృద్ధి చూపించింది.  గత ఏడాది క్యూ4 లో నమోదైన 8.8 శాతంతో పోలిస్తే తగ్గింది.
* సర్వీసెస్ సెక్టార్ (ట్రేడ్, హోటల్, ట్రాన్స్‌‌‌‌పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్‌‌‌‌కాస్టింగ్ సంబంధిత సర్వీసెస్) జీవీఏ  వృద్ధి క్యూ4లో 6 శాతంగా ఉంది. గత ఏడాది 6.2 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.
* ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ మార్చి 2025 త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి చూపించాయి.  గత ఏడాది 9 శాతంతో పోలిస్తే తగ్గింది.
* పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇతర సర్వీసెస్ క్యూ4లో 8.7శాతం వృద్ధితో దాదాపు ఫ్లాట్‌‌‌‌గా ఉంది.