కామారెడ్డి జిల్లా కేంద్రంలో ..ఘనంగా గీతా జయంతి వేడుకలు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ..ఘనంగా గీతా జయంతి వేడుకలు

కామారెడ్డిటౌన్, వెలుగు : గీతా పరివార్​ ఆధ్వర్యంలో  కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం గీతా జయంతి వేడుకలు నిర్వహించారు.  శ్రీనివాస్​నగర్​ కాలనీలోని కృష్ణాధ్యాన మందిరంలో కార్యక్రమాలు జరిగాయి. గీతా పరివార్​ సభ్యులు భగవద్గీతలోని 18 అధ్యాయాలను పారాయణం చేశారు.  భగవద్గీతలోని సారాంశాన్ని వివరించారు.  

ప్రతి ఒకరూ గీతను చదవాలని సూచించారు. గీతా పరివార్​ ప్రతినిధి సోమిశెట్టి గంగారాం ఆధ్వర్యంలో  నిర్వహించిన ఈ వేడుకల్లో  కృష్ణ మందిరం పీఠాధిపతి గాంధారికర్​బాబా, టెంపుల్ ప్రెసిడెంట్ శివాజీరావు,  ప్రతినిధులు   ప్రసాద్, రఘుకుమార్​,  సుదర్శన, మమత రేణుక,   రాంచంధర్​రావు, శ్యాంరావు,  కిషన్​రావులతో పాటు భక్తులు పాల్గొన్నారు.