అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

అసోం సీఎంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు.  మహిళా కమిషన్ ని కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ... సీఎం పీఠంపై కూర్చొన్న మూర్ఖుడు అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ అని విమర్శించారు. రాహుల్ గాంధీ పై చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అతడిని సీఎం పీఠం నుంచి పీకిపడేయాలన్నారు.

సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే.. తండ్రి ఎవరని అడుగుతారా? సీఎం నీచమైన కామెంట్స్ చేసినా.. రాహుల్ గాంధీ మాత్రం ఏ మాట అనలేదన్నారు. మహిళలు అంటే బీజేపీకి గౌరవం లేదన్నారు గీతారెడ్డి. ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా వెంటనే అసోం సీఎం పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల తరపున మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. తన పరిధిలోకి రాదని కేంద్ర కమిషన్ కు పంపిస్తామని చెప్పారని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతకుముందు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తక్షణమే ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో అస్సాం సీఎంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకూ చేరింది. 

ఇవి కూడా చదవండి:

చదువుకున్న అమ్మాయిలే టార్గెట్గా 17 పెళ్లిళ్లు

సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ