తాటి చెట్టుపై ఉరివేసుకొని గీత కార్మికుడు ఆత్మహత్య

తాటి చెట్టుపై ఉరివేసుకొని గీత కార్మికుడు ఆత్మహత్య

మునగాల, వెలుగు : తాటి చెట్టుకు ఉరి వేసుకొని ఓ గీత కార్మికుడి ఆత్మహత్య చేసుకున్నాడు. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) కల్లు గీస్తూ జీవిస్తున్నాడు. పిల్లలు లేకపోవడంతో భార్యభర్తలు ఇద్దరే ఉంటున్నారు. భార్యకు మతిస్థితిమితం లేకపోవడంతో ఆమె బాగోగులు చూసుకోవడంతో పాటు, ఇంటి పనులు సైతం చేసుకోవాల్సి రావడంతో మానసికంగా కుంగిపోయాడు. 

దీంతో శుక్రవారం తాటిచెట్టు ఎక్కి అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశం డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని కిందకు దించేందుకు ఓ వ్యక్తి తాటి చెట్టు ఎక్కుతుండగా మృతదేహం అతడిపై పడడంతో కిందపడి గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.