
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అది పెద్ది నిర్మాణ సంస్థల్లో ఒకటి జెమిని. ఈ సంస్థ వందల సినిమాలను నిర్మించడమే కాకుండా.. సినీ పరిశ్రమకు ఎందరో నటీనటులను పరిచయం కూడా చేసింది. ఇప్పటివరకు జెమిని గ్రూపులో ఎన్నో సంస్థలు ఉన్నాయి. జెమిని ఫిల్మ్ సర్క్యూట్, జెమిని ఎఫ్ఎక్స్, జెమినీ స్టూడియోస్ లాంటి సహ సంస్థలున్నాయి. 75 సంవత్సరాల చరిత్ర గల జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు.. ఆ సంస్థల సీఈఓ పీవిఆర్ మూర్తి చేతుల మీదుగా ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిష్టాత్మక జెమిని గ్రూప్ మ్యూజిక్ ఇండ్రస్టీలోకి కూడా అడుగుపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జెమినీ రికార్డ్స్ లేబుల్‌తో మ్యూజిక్ వరల్డ్ లోకి అడుగుపెడుతోంది జెమిని సంస్థ. ఈ సంస్థ కేవలం ప్రైవేట్ ఆల్బమ్స్‌ను నిర్మించడమే కాకుండా.. సినిమా పాటలను ప్రొడ్యూస్ చేయనుంది. అడుగుపెట్టిన ప్రతిచోట తనకంటూ ప్రత్యేక చరిత్రను చాటుకున్న జెమినీ.. మ్యూజిక్ ఇండ్రస్టీలో కూడా మార్క్ చాటేందుకు సిద్ధమవుతోంది.