మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో .. గరంగరంగా జనరల్​బాడీ మీటింగ్

మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో .. గరంగరంగా జనరల్​బాడీ మీటింగ్

రాయికోడ్​ (మునిపల్లి ), వెలుగు : మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో గురువారం ఎంపీపీ శైలజ అధ్యతక్షన మండల జనరల్​బాడీ మీటింగ్ జరిగింది.  సమావేశంలో పంచాయతీ రాజ్​శాఖపైనే 30 నిమిషాల చర్చ జరిగింది. కానీ  ఆ శాఖ అధికారి మధుకర్ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో అతడిపై సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ  విషయంపై ఎంపీడీవో హరినందన్​రావు మాట్లాడుతూ..  మీటింగ్​కు పీఆర్ ఏఈ రాలేదని అడిషనల్​కలెక్టర్​చంద్రశేఖర్​కు ఫోన్​ ద్వారా సమాచారం అందించారు.  దీంతో ఏఈకి షోకాజ్​నోటీసులు జారీ చేయాలని అడిషనల్​కలెక్టర్​ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో హరినందన్​ రావు, అధికారులు శివకుమార్, సంతోష్​ కుమార్, దశరథ్, శైలజ,  సభ్యులు పాండు, శివలీల, విజయ పాల్గొన్నారు.