రాష్ట్రంలో ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగే చాన్స్ : రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగే చాన్స్ : రాజగోపాల్ రెడ్డి
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


నిర్మల్ జిల్లా: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆరు నెలల ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కర్ణాటకతో పాటే రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణలో ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. నిర్మల్ లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధ్వాన్న పాలనపై మండిపడ్డారు.  

మునుగోడు తర్వాత కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల మెజార్టీని చూసి కేసీఆర్ కి నిద్ర పట్టడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందనే సంకేతాలతోనే బండి సంజయ్ పాదయాత్ర,  భైంసా బహిరంగ సభ రద్దుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. కేసీఆర్ ఏకపక్ష నియంత చర్యలతో తెలంగాణలో మరోసారి నిజాం పాలన గుర్తుకు వస్తోందన్నారు. ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది స్థానాల్లో గెలిచి బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.