టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్

టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్

హైదరాబాద్​, వెలుగు: జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ టాటా ఏఐజీ ఆరోగ్య బీమా కవరేజీలో ఐదు రెట్లు మెరుగుదలని అందించే లక్ష్యంతో "హెల్త్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్"ని ప్రవేశపెట్టింది.  ఈ కొత్త ప్లాన్ టైర్ 1–టైర్​4 నగరాల్లో నివసిస్తున్న కుటుంబాల విభిన్న ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీరుస్తుంది. హెల్త్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఛార్జ్ రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందిస్తుంది. కస్టమర్లు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అదనపు ఆప్షనల్​  బెనిఫిట్లను, రెండు ప్లాన్ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎంచుకోవచ్చు.

కంపెనీకి దేశవ్యాప్తంగా 10 వేల ఆసుపత్రుల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. టాటా ఏఐజి  హెల్త్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్​లో ఐదు రెట్లు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ బోనస్​ ఇస్తారు. మొదటి పాలసీ ప్రారంభ సమయంలో 40 ఏళ్లలోపు లేదా అంతకంటే తక్కువ వయస్సు వారికి అదనంగా ఐదు శాతం తగ్గింపు ఇస్తారు. యువత ఉన్న కుటుంబాలు అదనపు 5శాతం తగ్గింపు నుంచి ప్రయోజనం పొందవచ్చు, ఇది పాలసీ రెన్యువల్స్​పైనా వర్తిస్తుంది. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టు వాల్యూ ప్లాన్, జియో ప్లాన్​లో ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు.