జనరలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ కల్పించేందుకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా పాలసీదారులు క్యాన్సర్ వంటి 10 నుంచి 60 రకాల తీవ్ర రోగాల నుంచి రక్షణ పొందవచ్చు. క్లెయిమ్ మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ ఆదాయం రూపంలో పొందే వీలుంది.
పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా కుటుంబాలకు భరోసా ఇవ్వడమే దీని లక్ష్యమని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ అలోక్ రూంగ్తా తెలిపారు. ఈ రైడర్ ను ప్రస్తుత పొదుపు లేదా ఆదాయ పథకాలకు చేర్చవచ్చు. పాలసీ కొనుగోలు చేసే సమయంలోనే ఈ అదనపు ప్రయోజనాన్ని ఎంచుకునే సౌకర్యాన్ని కంపెనీ కల్పించింది. ఇది కష్ట సమయాల్లో ఆర్థిక భరోసా ఇస్తుంది.
