జన్యులోపం : సాగరకన్యలా శిశువు జననం

జన్యులోపం : సాగరకన్యలా శిశువు జననం

సంగారెడ్డి టౌన్: జన్యులోపం కారణంగా ఒకే కాలితో ఉన్న శిశువు జన్మించింది. ఘటన సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ హస్పిటల్ లో గురువారం ఉదయం జరిగింది. వట్‌పల్లి మండలం పోతులబొగుడకు చెందిన సుజాత ప్రసవం కోసం హస్పిటల్ లో అడ్మిట్‌ అయ్యారు. నొప్పులు రావడంతో సర్జరీ చేసి శిశువును బయటకు తీశారు డాక్టర్లు. శిశువుకు రెండు చేతులు ఉన్నా.. సాగరకన్యలాగ రెండు కాళ్లు కలిపి ఒకే కాలు ఉందని తెలిపారు డాక్టర్లు. ఇలాంటి జననాలు చాలా అరుదని, ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నా.. బతకడం చాలా కష్టమని చెప్పారు. బరువు తక్కువగా ఉండటంతోపాటు జననేంద్రియాలు ఏవీ లేవని, సిరినోమిలియా అనే జన్యు సంబంధ లోపం వల్ల ఇలాంటి శిశువులు జన్మిస్తారని  తెలిపారు డాక్టర్లు.