
హైదరాబాద్, వెలుగు : జీనోమ్ వ్యాలీలో ఆరిజన్ ఫార్మా సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ఏర్పాటు చేయనుంది. డాక్టర్ రెడ్డీస్సబ్సిడరీ సంస్థ అయిన ఆరిజన్ ఫార్మా రూ.330 కోట్లతో ఈ యూనిట్స్థాపించనుంది. మంగళవారం మంత్రి కేటీఆర్ తో డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, ఆరిజన్ ఫార్మా సీఈవో అఖిల్రవి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు.