యాషెస్ తొలి టెస్ట్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో కేవలం రెండు రోజుల్లో జరిగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది. షాట్ సెలక్షన్ ఇంగ్లాండ్ ఓటమికి కారణమని అర్ధమవుతోంది. తొలి ఇన్నింగ్స్ లో బౌలర్లు రాణించినా రెండు ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ లో విఫలం కావడం ఇంగ్లాండ్ కొంప ముంచింది. ఈ పరాజయంతో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తో పాటు ఆ దేశ లెజండరీ క్రికెటర్స్ ఇంగ్లాండ్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ జియోఫ్రీ బాయ్‌కాట్ ఇంగ్లాండ్ కు సీరియస్ నెస్ లేదని ఫైరయ్యాడు.
జియోఫ్రీ బాయ్‌కాట్ మాట్లాడుతూ.. "పదే పదే తెలివి తక్కువ పనులు చేస్తూ ఓడిపోతున్నారు. ఇంగ్లాండ్ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. మ్యాచ్ లను పోరాడకుండా చేజార్చుకుంటున్నారు. డకెట్ మంచి బంతికి ఔటయ్యాడు. కానీ పోప్ చేజేతులా వికెట్ పోగొట్టుకున్నాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బాల్స్ ను డ్రైవ్ చేసి ఔటయ్యాడు. హెడ్ ఎటాకింగ్ తో ఇంగ్లాండ్ తమ వ్యూహాలను కోల్పోయింది. మ్యాచ్ లో కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇంగ్లాండ్ చేతులెత్తేస్తుంది". అని బాయ్‌కాట్ ది టెలిగ్రాఫ్ UK కాలమ్‌లో రాశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్ (83 బాల్స్‌లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 నాటౌట్) టీ20 తరహా బ్యాటింగ్ చేయడంతో రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. ఫలితంగా సిరీస్‌లో కంగారూలు 1–0 ఆధిక్యంలో నిలిచారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరంభం నుంచే ఇంగ్లిష్ బౌలర్లపై విరుచుకుపడ్డ హెడ్.. జాక్ వెదరాల్డ్ (23)తో తొలి వికెట్‌కు 75, మార్నస్ లబుషేన్ (51)తో రెండో వికెట్‌కు 117 రన్స్ జోడించాడు.
►ALSO READ | IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్: గిల్ ఔట్.. జైశ్వాల్‌కు ఛాన్స్.. రాహుల్‌కు కెప్టెన్సీ
అంతకుముందు 123/9 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 132 రన్స్‌కే ఆలౌటైంది. స్టోక్స్ 5, కార్స్ 3, ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌట అయింది. 40 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 34.4 ఓవర్లలో 164 రన్స్‌కే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ ముందు 205 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. అట్కిన్సన్ (37) టాప్ స్కోరర్. ఒలీ పోప్ (33), డకెట్ (28) ఓ మాదిరిగా ఆడారు. బోలాండ్ 4, స్టార్క్, డాగెట్ చెరో మూడు వికెట్లు తీశారు. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
