నిమ్స్ లో వయోజన వ్యాక్సినేషన్ ​క్లీనిక్

నిమ్స్ లో వయోజన వ్యాక్సినేషన్ ​క్లీనిక్

​పంజాగుట్ట, వెలుగు: దీర్ఘకాల జబ్బులతో ప్రతి ఏటా 25లక్షల మంది చనిపోతున్నట్టు ప్రపంచ ఆరో గ్య సంస్థ సర్వేలో వెల్లడైందని నిమ్స్​ డైరెక్టర్​నగరి బీరప్ప తెలిపారు. సోమవారం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా నిమ్స్​ లో కొత్తగా ఏర్పాటు చేసిన వయోజన వ్యాక్సినేషన్​ క్లీనిక్​ను ప్రారంభించి మాట్లాడారు. అంటువ్యాధుల నివారణలో  ఇమ్యునైజేషన్​పాత్ర ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు.  

క్లీనిక్​ ద్వారా అంటు వ్యాధులను గుర్తించి టీకా సాయంతో పూర్తిగా నియంత్రించవచ్చని  తెలిపారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రోగులకు క్లీనిక్​ అందుబాటులో ఉంటుందని చెప్పారు.  ఆస్పత్రి జనరల్​మెడిసిన్​ విభాగం హెచ్ఓడీ నావల్ చంద్ర, సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, డీన్​ లిజా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్​రిజిస్ట్రార్​శాంతి వీర్, జనరల్​ మెడిసిన్​ సీనియర్​ప్రొఫెసర్​సత్యనారాయణ రాజు, డాక్టర్​సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.