జర్మన్​ భాషపై  నిమ్స్​లో శిక్షణ షురూ

జర్మన్​ భాషపై  నిమ్స్​లో శిక్షణ షురూ

పంజగుట్ట, వెలుగు : నిమ్స్​ఆస్పత్రిలో నర్సుల కోసం జర్మన్​భాష శిక్షణ ప్రోగ్రామ్ ను ప్రాంభించారు. తెలంగాణ ప్రభుత్వం ,టామ్​కామ్​(తెలంగాణ ఓవర్సీస్​మ్యాన్​పవర్​ కంపెనీ లిమిటెడ్ )​ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతుంది. రిటైర్డ్​ఐఏఎస్​ రాణికుముదిని బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విదేశాల్లో నర్సింగ్​లో ఉపాధి పొందాలనుకునే వారికి శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని ఆమె పేర్కొన్నారు.

జర్మన్​భాష శిక్షణకు 40 మందిని ఎంపిక చేశారు. అనంతరం వారు జర్మన్ లో ఉపాధి పొందుతారు. నిమ్స్​డైరెక్టర్​నగరి బీరప్ప, టామ్​కామ్​ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్​ఇ.విష్ణు వర్ధన్​రెడ్డి, డాక్టర్​లిజా రాజశేఖర్​,డాక్టర్​ టి.గంగాధర్​,ప్రొఫెసర్​ప్రశాంత్​ తదితరులు పాల్గొన్నారు.