ఆడి కొత్త కారు @ 81లక్షలు

ఆడి కొత్త కారు @ 81లక్షలు

జర్మనీ లగ్జరీ కారు కంపెనీ ఆడి ఇండియా మార్కెట్లో సోమవారం ఎస్​5 స్పోర్ట్​ బ్యాక్​ ప్లాటినమ్​ ఎడిషన్ ​కారును లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ.81.57 లక్షలు. ఇందులోని 3.0 ఇంజన్​ 354 హెచ్​పీని, 500 ఎన్​ఎం టార్క్​ను ఇస్తుంది. 31.42 సెంటీ మీటర్ల ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, స్పోర్ట్స్​ సీట్లు, ఎంఎంఐ సిస్టమ్, క్లైమేట్​ కంట్రోల్​, 180 వాట్ల మ్యూజిక్​ సిస్టమ్ ​ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. పండుగ సీజన్​ కోసం దీనిని పరిచయం చేశామని ఆడి తెలిపింది.