స్పెయిన్తో మ్యాచ్ను డ్రా చేసుకున్న జర్మనీ..నాకౌట్ బెర్తు కష్టమే..

స్పెయిన్తో మ్యాచ్ను డ్రా చేసుకున్న జర్మనీ..నాకౌట్ బెర్తు కష్టమే..

ఫిఫా ప్రపంచకప్ 2022 తొలి మ్యాచ్లో ఓడిన జర్మనీ.. స్పెయిన్తో జరిగిన రెండో మ్యాచ్ను డ్రా చేసుకుంది. రెండు జట్లు చెరో గోల్ సాధించడంతో...మ్యాచ్ డ్రా అయింది.  స్పెయిన్‌ తరఫున అల్వారో మొరాటా 62వ నిమిషంలో గోల్‌ కొట్టాడు. జర్మనీలో సబ్‌స్టిట్యూట్‌ ఫుల్క్‌రుగ్‌ 83వ నిమిషంలో గోల్‌ సాధించాడు.

సెకండాఫ్ లో గోల్స్..

హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఫస్టాఫ్  రెండు జట్లు గోల్ సాధించేందుకు తెగ ప్రయత్నించాయి. ఇరు జట్ల గోల్ పోస్టులపై దాడులు చేశాయి. కానీ గోల్ కీపర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. అయితే సెకండాఫ్లో స్పెయిన్‌ తరఫున అల్వారో మొరాటా 62వ నిమిషంలో గోల్ కొట్టాడు. దీంతో స్పెయిన్ ఆధిక్యం 1–0కు పెరిగింది. ఇదే ఆధిక్యాన్ని చివరి వరకు స్పెయిన్ కొనసాగించింది. అయితే 83వ నిమిషంలో జర్మనీ జట్టులో సబ్‌స్టిట్యూట్‌ ఫుల్క్‌రుగ్‌ అనూహ్యంగా గోల్ సాధించడంతో మ్యాచ్ 1–1తో  డ్రా అయింది. 

జర్మనీ నాకౌట్ చేరేనా ?

నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీ ఈసారి నాకౌట్ చేరడమే కష్టమే. తొలి మ్యాచ్లో జపాన్ చేతిలో ఓటమితో ఆ జట్టు నాకౌట్ ఆశలపై ప్రభావం చూపింది. తాజాగా స్పెయిన్తో డ్రా కావడంతో నాకౌట్ బెర్తు క్లిష్టంగా మారింది. అయితే  ఆదివారం కోస్టారికాతో జరిగే మ్యాచుతో జర్మనీ భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్లో కోస్టారికాను ఓడించినా కూడా నాకౌట్ చేరే అవకాశాలు తక్కువే. ఇతర జట్ల ఫలితాలతో జర్మనీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.