ప్రయోగం.. వేర్వేరు టీకాలు తీసుకున్న జర్మనీ చాన్స‌లర్

ప్రయోగం.. వేర్వేరు టీకాలు తీసుకున్న జర్మనీ చాన్స‌లర్

బెర్లిన్: వేర్వేరు టీకా డోసులను తీసుకోవడంపై విషయంపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, టీకా కొరతను అధిగమించేందుకు రెండు వేర్వేరు డోసులను తీసుకోవచ్చా అనే కోణంలో ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ సమయంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏంజెలా మెర్కెల్ (66) వేర్వేరు టీకా డోసులను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికార ప్రతినిధి వెల్లడించారు. ఏప్రిల్‌లో తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న మెర్కెల్ తర్వాత తాజాగా మోడర్నా వ్యాక్సిన్‌ వేసుకున్నారు. గత 16 ఏళ్లుగా జర్మనీని పాలిస్తోన్న మెర్కెల్.. ఈ ఏడాది పదవి నుంచి దిగిపోనున్నారు. కాగా, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి (73) కూడా ఏంజెలా మెర్కెల్‌ను అనుసరించారు. ఆయన కూడా వేర్వేరు టీకా డోసులను తీసుకున్నారు. మొదటి డోసుగా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న డ్రాగి.. రెండో విడతగా ఫైజర్ టీకాను వేయించుకున్నారు.