డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు కావాలా..ఇలా పొందండి..

డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు కావాలా..ఇలా పొందండి..

ఈ రోజుల్లో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు ఇవి చాలా తప్పనిసరిగా ఉండాల్సిన ఐడెంటిటీ డాక్యుమెంట్లు. అయితే అందరి దగ్గర డిజిటల్ ఆధార్ కార్డు, పాన్ కార్డులు తప్పనిసరిగా ఉంటాయి కానీ.. డిజిటల్ ఓటరు ఐడీ కార్డు  ఉండకపోవచ్చు. అలాంటి వారికోసం డిజిటల్ ఓటర్ ఐడీ ఎలా పొందాలి.. డౌన్ లోడ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలను మీకు అందిస్తున్నాం.. 

డిజిటల్ ఓటరు ఐడీ కార్డు పొందాలంటే.. ముందుగా.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ htttp://voters.eci.gov.in/loginలోకి వెళ్లాలి. అక్కడ మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ఇచ్చాక OTP  వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే పాస్ వర్డ్ సెట్ చేసుకోమని చెబుతుంది. పాస్ వర్డ్ సెట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. తర్వాత మొబైల్ నంబర్,పాస్ వర్డ్ వచ్చికింద కనిపించే కాప్చా నంబర్ ఎంటర్ చేస్తే లాగిన్ కావొచ్చు.

మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ఇచ్చి కింద కనిపించే కాప్చా నంబర్ ఎంటర్ చేశాక Request OTP  పై క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి Verify & login  పై క్లిక్ చేయాలి. మీకు సైట్ లో కుడివైపు కింద మూలన ఉన్న E-EPI download పై క్లిక్ చేయాలి. ఇప్పుడు విండోలో కనిపించే Enter EPIC NO దగ్గర మీ ఓటర్ ఐడీ కార్డుకి సంబంధించిన ఎపిక్ నంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత  Select State  లో మీ రాష్ట్రం పేరును సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ బాక్స్ క్లిక్ చేయాలి. 
సెర్చ్ బాక్స్ క్లిక్ చేయగానే మీ ఓటర్ ఐడీకి సంబంధించిన వివరాలను చూపిస్తుంది. ఆ వివరాలు సరైనవే అని నిర్ధారించుకొని కింద ఉన్న  Send OTP ని క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే Verify బాక్స్ క్లిక్ చేయాలి. తర్వాత Download e -EPIC  క్లిక్ చేయడం ద్వారా మీ డిజిటల్ ఓటరు ఐడీని పొందవచ్చు.