యుక్తికి ఫలితం దక్కేనా?

యుక్తికి ఫలితం దక్కేనా?

నాగశౌర్య హీరో(Nagashaurya) గా వచ్చిన ‘రంగబలి’ సినిమాతో టాలీవుడ్​కి మరో కొత్త హీరోయిన్​ పరిచయమైంది. ఉత్తరాదికి చెందిన యుక్తి తరేజా(YuktiThareja) చిన్ననాటి నుంచి నటనపై ఇష్టం పెంచుకుంది. అనుకున్నట్టుగానే మోడలింగ్​ చేసి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. 

గతేడాది ఇమ్రాన్​ హష్మీ(Emraan Hashmi) తో కలిసి చేసిన ‘లుట్​ గయే’ సాంగ్​ యూట్యూబ్​లో టాప్​లో నిలిచింది. ఆ పాటతో ‘రంగబలి’ సినిమా ఆఫర్​ అందుకుంది. ఇక ఈ సినిమాలో మెడికల్​ స్టూడెంట్​గా నటించిన ఈ బ్యూటీ మంచి మార్కులే కొట్టేసింది. ఇందులో ఓ సాంగ్​లో గ్లామర్​ షోకి హద్దులు చెరిపేసి యూత్​ను ఆకట్టుకుంటోంది.  

స్టార్​ హీరోలతో పాటు యంగ్​ హీరోల పక్కన కూడా సరిపోయే ఫీచర్స్​ ఉండటంతో టాలీవుడ్​లో మరిన్ని ఆఫర్స్​ వచ్చే చాన్స్​ ఉంది.  ఇక సోషల్ మీడియాలోనూ యుక్తికి ఆరు లక్షల పైగానే ఫాలోవర్స్​ ఉన్నారు.