కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్

కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్

హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. తెలుగులో మూడు సినిమాలు చేస్తున్న సమంత.. కాఫీ విత్ కరణ్ షో (Koffee With Karan S7)లో మెరిశారు. టాలీవుడ్, బాలీవుడ్ నటులను పిలుస్తూ.. దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వారితో మాట్లాడుతుంటాడు. తాజాగా.. ఏడో సీజన్ జరుగుతోంది. గెట్ రెడీ అంటూ డిస్నీ + హాట్ స్టార్ (Disney+ Hotstar) ఓ ప్రోమోను విడుదల చేసింది. అందులో సమంత, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రోమోలో సమంతను అక్షయ్ ఎత్తుకుంటూ వచ్చారు. నెంబర్ వన్ హీరో.. నెంబర్ వన్ హీరోయిన్ ను మోసుకొస్తున్నాడంటూ కరణ్ కామెంట్ చేశారు. సమంత పింక్ కలర్ లో హోయలు ఒలకపోయగా.. బ్లూ కలర్ సూట్ లో అక్షయ్ అలరించారు. 

ఈ సందర్భంగా అక్షయ్, సమంతలను పలు ప్రశ్నలు అడిగారు. అన్ హ్యాపీ మ్యారేజెస్ అనగానే... అన్నింటికీ కారణం నువ్వే అంటూ సమంత చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ షోలో అక్షయ్ కుమార్, సమంతలు డ్యాన్స్ లు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఈ షోలో పెళ్లి, విడాకులకు సంబంధించిన విషయాలపై సమంత మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ షో గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫన్నీ, క్వశ్చన్, గేమ్స్, చిట్ చాట్ తో సాగుతున్న ప్రోమో అందరినీ ఆకట్టుకొంటోంది.