‘RRR’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్

‘RRR’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్

రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న RRR సినిమాపై చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తుండగా.. ఇప్పుడు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పింది RRR టీమ్. ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

‘బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. ప్రశాంతత లేదు.. ఇక సెలబ్రేషన్స్ ప్రారంభించండి’ అని తెలుపుతూ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. జననీ సాంగ్ లో ఉన్న అందరి లుక్ ని కలగలుపుతూ వారి ఎమోషన్స్ ఎలివేట్ చేస్తూ ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా సందడి చేయనున్నాడు. చెర్రీకి జోడిగా అలియా కనిపిస్తుండగా, తారక్ కి జోడిగా ఒలియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.