సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే

సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే

సుడీగాలి సుధీర్ బుల్లితెరపై అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోల్ కమోడియన్ గా.. టీవీ షోల్లో యాంకర్ గా .. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు. చిన్నా చితక మెజిషియన్ చేసుకుంటూ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి  ఇమేజ్ పెంచుకున్నాడు. ప్రస్తుతానికి పలు షోలతో బిజీగా గడుపుతున్నాడు సుధీర్..వీలైనప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు. బుల్లితెర త్రీ ఇడియట్స్  అంటే సుడిగాలీ సుధీర్, ఆటో రాంప్రసాద్,గెటప్ శ్రీను. వీళ్లు ముగ్గురు కలిస్తే  ఉండే హంగామే హంగామా. అయతే ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలీ సుధీర్ కెరీర్ కు తానే రూట్ మ్యాప్ వేశానని గెటప్ శ్రీను అన్నాడు.. అసలు జబర్దస్త్ షోలో తనకు టీం లీడర్ రాకపోవడానికి కారణం కూడా సుధీర్ అని గెటప్ శ్రీను చెప్పాడు.

గెటప్ శ్రీను మాటల్లో ‘ జబర్దస్త్ కి ముందు మలేషియాలో ఓ సినిమా షూటింగ్ లో కామోడియన్ వేణు నాకు  పరిచయమయ్యాడు. త్వరలో జబర్దస్త్ షో పెడుతున్నట్లుగా  నాతో చెప్పాడు. అయితే అప్పటికే నేను ఓ న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్నా. అప్పటికి సుధీర్ నా రూమ్ మేట్. సుధీర్ ను తీసుకెళ్లి వేణుకి పరిచయం చేశా. అలా సుధీర్ జబర్దస్త్ షోకి పరిచయం అయ్యాడు. నేను ఏడాది తర్వాత జబర్దస్ద్  టీంలో జాయిన్ అయ్యాను. అలా సుధీర్ నాకంటే ముందు జబర్దస్త్ లో సెటిల్ అయ్యాడు. తర్వాత వేణు టీం వెళ్లిపోయాక సుడిగాలీ సుధీర్ ను టీం లీడర్  చేశారు. అయితే సుధీర్ తనకన్నా ఏడాది ముందు వచ్చాడని అతన్ని టీం లీడర్ చేశారు. అలా నాకు టీం లీడర్ అవకాశం రాలేదు. తర్వాత మేం మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నాం..తర్వాతి జర్నీ అందరికీ తెలిసిందే‘ అని గెటప్ శ్రీను చెప్పాడు.

see more news

భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

వికారాబాద్ లో వింత వ్యాధికి కారణం కల్తీకల్లే..