PEDDI Glimpse: ‘పెద్ది’ హై వోల్టేజ్ గ్లింప్స్.. కుస్తీ రింగులో రామ్ చరణ్ ఉగ్రరూపం

PEDDI Glimpse: ‘పెద్ది’ హై వోల్టేజ్ గ్లింప్స్.. కుస్తీ రింగులో రామ్ చరణ్ ఉగ్రరూపం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (PEDDI). ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇవాళ శుక్రవారం (2026 మార్చి 27న) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ స్పెషల్ వీడియో ‘‘పెహల్వాన్ గ్లింప్స్’’ పేరిట రిలీజై దుమ్మురేపుతుంది. క్షణాల్లోనే యూట్యూబ్తో సహా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దూసుకెళ్తోంది. 

గ్లింప్స్ విషయానికి వస్తే.. కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ  పవర్ ప్యాక్ గ్లింప్స్ అదిరిపోయింది. పహెల్వాన్‌గా చరణ్ అదిరిపోయే ట్రాన్స్‌ఫర్మేషన్ ఇచ్చారు. కుస్తీ రంగంలో రామ్ చరణ్ రౌద్రరూపం టీజర్‌లో హైలైట్గా నిలిచింది.

‘‘కుస్తీ అంటే బంతితో బ్యాట్కు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట’’ అనే పవర్ఫుల్ డైలాగ్తో విలన్ ప్రశ్నించగా.. ‘‘సుడమ్మి..ఆటే నా పొగరు’’ అనే గంభీరమైన వాయిస్తో చరణ్ తిరిగి డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంటోంది.

అలాగే, వీడియోలో చరణ్ కుస్తీ కోసం సన్నద్ధమవడం, ప్రత్యర్థులపైకి దూసుకెళ్లే సీన్ను ఇంటెన్స్గా డిజైన్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. గతంలో రిలీజైన ఫస్ట్ షాట్ వీడియో సిక్సర్ కొడితే.. ఇపుడు ఈ గ్లింప్స్ ఏకంగా కోర్ట్ బయటే పడింది. 

భారీ అంచనాలతో..

 ‘పెద్ది’ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో చరణ్ ఒక రస్టిక్ లుక్‌లో, విజయనగరం యాసలో మాట్లాడుతూ కనిపిస్తారు.

క్రికెట్, కుస్తీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'చికిరి చికిరి' చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇటీవలే విడుదలైన రెండో సింగిల్ 'రై రై రా రా' సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.