ఓయూలో ముగిసిన మహిళా సదస్సు..మహిళా సాధికారత, సమానత్వంపై చర్చ

ఓయూలో ముగిసిన మహిళా సదస్సు..మహిళా సాధికారత, సమానత్వంపై చర్చ

ఓయూ, వెలుగు: ఓయూ చరిత్రలో నిలిచిపోయేలా మూడ్రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సదస్సు గురువారం ఘనంగా ముగిసింది. “గివ్ టు గెయిన్: సుస్థిరత కోసం మహిళా శక్తి” అనే అంశంతో జరిగిన ఈ సదస్సు.. మహిళా సాధికారత, సమానత్వం, సుస్థిర అభివృద్ధిపై విస్తృత చర్చలకు వేదికైంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొని విద్య, సాంకేతికత, నాయకత్వం, సామాజిక మార్పులపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ముగింపు సభకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయాని, గౌరవ అతిథులు ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, రమాదేవి కన్నెగంటి హాజరయ్యారు.

ఆర్థిక అక్షరాస్యత, మానసిక ధృఢత్వం, పని-జీవిత సమతుల్యత, భారతీయ సంస్కృతిలో నారీ శక్తి ప్రాధాన్యతపై ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 34 మంది మహిళలను ఘనంగా 
సన్మానించారు.