అచ్చంపేట ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట ను ఆదర్శ పట్టణంగా  తీర్చిదిద్దడమే లక్ష్యం : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
  •     ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు : అచ్చంపేట పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. గురువారం అచ్చంపేట మున్సిపాలిటీలో నిర్వహించిన 2026-–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొని పట్టణ ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.