- మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి వంద శాతం ఇసుక సరఫరా ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్లైన్లో నమోదు చేయించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏఎస్పీ మహేందర్, డీఎస్పీలు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మైనింగ్, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.
